ఓబీసీ డిమాండ్ల సాధనకై మార్చి 16 న పార్లమెంట్ ముట్టడి
1 min read

ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్
విజయవాడ, న్యూస్ నేడు: సమగ్ర జనగణన లో ఓబీసీ కులగణన చేపట్టాలనీ కేంద్ర మంత్రి మండలి మంత్రి మండలి నిర్ణయం అమలు చేయాలని ,కేంద్రంలో ఓ బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 16 వ తేదీన పార్లమెంట్ ముట్టడిస్తామని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ పేరుకొన్నారు.శుక్రవారం ఏలూరు రోడ్ లోని ఓబీసీ సంక్షేమ సంఘం కార్యాలయం లో జరిగిన విలేఖరుల సమావేశంలో వరప్రసాద్ యాదవ్ మాట్లాడారు. ఓబీసీ ల పట్ల రాహుల్ గాంధీ తీరుకు నిరసనగా మార్చి 17 న ఏఐసీసీ కార్యాలయం ముట్టడిస్తామని వరప్రసాద్ యాదవ్ హెచ్చరించారు.మార్చి 18 న ఓబీసీ ల జాతీయ సదస్సు ఢిల్లీ కాన్స్ట్యూషన్ క్లబ్ లో జరుగుతుందని వరప్రసాద్ తెలిపారు.ఈ సదస్సు లో వివిధ పార్టీల జాతీయ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాటపర్తి పోసిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్న సుబ్బారావు,ఓబీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి యు.పేరయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్ శిఎం.శివన్నారాయణ , పాల్ఘొన్నారు .విజయవాడ నగర ఓబీసీ మహిళ సంఘం అధ్యక్షురాలు మల్లెడ రూప, నందిగామ నియోజక వర్గ కన్వీనర్ గా కె.నవీన్, ఎన్టీఆర్ జిల్లా కో – ఆర్డినేటర్ గా ఎం. మల్లిఖార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎం.శివన్నారాయణ చందర్లపాడు, నందిగామ, వీరులపాడు, కంచికచర్ల మండల ఓబీసీ సంఘం అధ్యక్షులుగా గోపీకృష్ణ, పి. నాగరాజు, వై శ్రీనివాస్, బి.రామకృష్ణ లను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు.


