కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తప్పవు..
1 min read

తహసిల్దార్ విద్యాసాగర్.
ఓర్వకల్లు, న్యూస్ నేడు: ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే కఠినచర్యలు తప్పవని తహసిల్దార్ విద్యాసాగర్ పేర్కొన్నారు. మంగళవారం ఓర్వకల్లు లో పలు ఎరువుల దుకాణాలను, దుకాణాలకు సంబంధించి గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు. ధరల పట్టిక, స్టాకు రిజిస్టర్, స్టాకును పరిశీలిం చారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ ఎరువు లను నిర్దేశించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ అమ్మినా కఠినచర్యలు తీసుకోవడంతో పాటు దుకా ణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిం చారు. రైతులకు ఎరువులు అమ్మిన వెంటనే ఈ -పాస్ తప్పనిసరిగా నమోదు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సరుకు వివరాలు, ధరలను తెలిపే బోర్డులను షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఇకపై ప్రతినిత్యం తనిఖీలు ఉంటాయని,ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మధుమతి తదితర అధికారులు పాల్గొన్నారు.

