మదర్ తెరిసా సేవలు మరువలేనివి -మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఎక్కడో పుట్టి భారతదేశానికి వచ్చి దేశ ప్రజలకు మదర్ తెరిసా చేసినటువంటి సేవలు చిరాస్మరణీయమని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. మదర్ తెరిసా 116వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక ప్రకాష్ నగర్ లో ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మదర్ తెరిసా పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బర్త్డే కేకును రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడో విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి పేద ప్రజలకు మదర్ తెరిసా చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరిసాను స్ఫూర్తిగా తీసుకొని, ఇతరులకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. మదర్ తెరిసా స్ఫూర్తితో గత 20 సంవత్సరాలుగా అభయగిరిలో ఉన్న హెచ్ఐవి,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం కొరకు సేవలు చేస్తుండడం అభినందనీయమన్నారు. అభయగిరిలో సేవా కార్యక్రమాలు నిమిత్తం తమవంతుగా సహాయ సహకారాలు అందజేస్తున్నట్టు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ శ్రీ లక్ష్మీ విద్యా సంస్థల డైరెక్టర్ దీక్షిత్, సురేంద్ర, డాన్సర్ రామకృష్ణ, అభయగిరి నిర్వహకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

