అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112 కి సమాచారం అందించండి
1 min read

పోలీస్ వారి హెచ్చరిక కు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పెదవేగి ఎస్సై సిహెచ్. రాజశేఖర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యులతో కూడిన ఒక రాబరీ గ్యాంగ్ మన ప్రాంతంలో సంచరిస్తున్నట్లు నమ్మకమైన సమాచారం అందింది.ఈ గ్యాంగ్ ఇప్పటికే పలు చోట్ల నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలియవచ్చిందన్నారు.ఈ ముఠా సభ్యులు ఎక్కువగా తక్కువ రేటు ఉన్న లాడ్జ్‌లలో తలదాచుకుంటూ ఉంటున్నారని తెలిపారు.ఎక్కడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంది.ప్రజలకు పోలీస్ వారి యొక్క సూచనలు పాటించాలన్నారు.ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112 కి ఫోన్ చేసి పోలీసులను సమాచారం అందించాలన్నారు.మీ ఇంటిలో లో ఉన్నవిలువైన ఆభరణాలు డబ్బులు బ్యాంకు లో భద్రపరుచుకోవాలని తెలిపారు.ఈ సమాచారం ఇరుగుపొరుగు వారితో పాటు ఎక్కువ మందికి చేరవేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పెదవేగి సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల యొక్క పరిధిలో ఆటో లలో మైక్ ద్వారా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ చరవాణి నెం. ఇన్స్పెక్టర్ పెదవేగి వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ 9440796635ఎస్ఐ పెదపాడు యొక్క నెంబర్ 9440796637దెందులూరు ఎస్సై యొక్క ఫోన్ నెంబర్ 9440796654 లకు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ తెలియజేశారు.

