తహసిల్దార్ కాళ్లు మొక్కిన రైతు..
1 min read

పదేళ్లుగా తిరుగుతున్నా పరిష్కారం కాని వైనం..
మిడుతూరు, న్యూస్ నేడు : గత పదేళ్లుగా తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని రైతు రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని ఓ రైతు తహసిల్దార్ కాలు మొక్కిన సంఘటన మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో బుధవారం రీ సర్వేపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో గ్రామానికి చెందిన రైతు గూడెం నాగేశ్వర రావు కుమారుడు ఎమ్మార్పీఎస్ నాయకులు గూడెం సామన్న మిడుతూరు తహసిల్దార్ టి శ్రీనివాసులు కాళ్ళు మొక్కలు.సర్వే నెంబర్ 474/డి 2లో కరెంటు స్తంభాలు తొలగించాలని గత పది సంవత్సరాలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉన్నా పట్టించుకోవడం లేదని కనీసం మీరైనా కరెంటు స్తంభాలు తొలగించాలని కాళ్లు మొక్కారు.అయ్యా మీ సమస్యను పరిష్కరిస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు. నాలుగవ తేదీ నుండి గ్రామంలో రీ సర్వేను రైతులు తమ పొలాలను దగ్గరగా ఉండి కొలతలు వేయించుకోవాలని తహసిల్దార్ రైతులకు సూచించారు.

