అక్రమంగా అరెస్టు చేసిన అంగన్వాడీలను విడుదల చేయాలి
1 min read
సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ పర్షియన్ ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు చిట్టెమ్మ పద్మ డిమాండ్.
న్యూస్ నేడు, పత్తికొండ: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తాం అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం. రవిచంద్ర హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని మార్చి రెండో తేదీన విజయవాడలో మహాధర్నా కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధంగా అంగన్వాడీలను అరెస్టు చేసి నిర్బంధించిందనీ, వెంటనే వారిని విడుదల చేయాలని సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలోని ఎర్రగుడీశ్వర్ రెడ్డి భవనం నుండి ర్యాలీ నిర్వహించి స్థానిక నాలుగు స్తంభాల కూడలి లో రాస్తారోకో కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి అంగన్వాడి నాయకురాలు చిట్టెమ్మ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా నాయకులు వెంకటేశ్వర రెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం.రవిచంద్ర, తుగ్గలి మండల కార్యదర్శి శ్రీరాములు మద్దికేర మండల కార్యదర్శి రాముడు అంగన్వాడి ప్రాజెక్టు కార్యదర్శి పద్మజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తానని ప్రకటనలకే పరిమితమైందని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది అంగన్వాడీల వేతనాలు పెంచాలని గత ఐదు సంవత్సరాల నుండి ఎటువంటి వేతనాలు గాని ఇతర సౌకర్యాలని కల్పించడం లేదని వెంటనే సమస్యలు పరిష్కరించాలని చేపట్టినటువంటి అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. రెండో తారీకు విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది అంగన్వాడీలను చూసి రాత్రికి రాత్రి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బేబీ రాణి సుబ్బరావమ్మల తో పాటు అనేకమంది .


