NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నోరి హాస్పటల్ నిర్లక్ష్యం వలన పసిపాప మృతి

1 min read

విజయవాడ , న్యూస్​ నేడు : నోరి హాస్పిటల్ వద్ద మంగళవారం ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. ఛెస్ట్ ఇన్ఫెక్షన్‌తో చికిత్స పొందుతూ పసిపాప అన్విషిత ప్రాణాలు కోల్పోయింది.తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటునన్న పాప ఇక లేదని తెలిసి బాధతో తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈనెల 19వ తేదీన అన్విషితను ఆసుపత్రిలో చేర్చినట్టు తల్లిదండ్రులు కట్ట శ్రీనివాస్, ప్రసన్న తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించిందని, చివరికి ఈ రోజు ఉదయం మరణించిందని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం గా సామాదానం చెప్పారని అవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె ప్రాణం కాపాడటానికి ఆసుపత్రి వైద్యులకు ఇప్పటికే 18 లక్షల రూపాయలు చెల్లించామని, అయినప్పటికీ సరైన చికిత్స అందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని వారు అన్నారు.  పాప మృతి వార్తతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

About Author