మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజిద్దాం
1 min read

పర్యావరణాన్ని కాపాడుదాం
ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
చెన్నూరు న్యూస్ నేడు: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను మాత్రమే పూజించుకోవడం శ్రేయస్కరమని అది పర్యావరణానికి కూడా ఎంతో మేలని మన సంప్రదాయాలను మనం గౌరవించుకోవాలని ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తెలిపారు. మంగళవారం ఆయన చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలు వినియోగించడం మంచిదని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇతర రసాయనాలతో రూపొందించిన విగ్రహాలు నిమజ్జనం అనంతరం అవి నీటిలో కరగకపోగా రసాణాల వల్ల చెరువులో ఉండే జీవజాతిపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటిలో మండపాలలో పూజించే విగ్రహాలు కేవలం మట్టి తోనే రూపొందించి పూజించుకోవడం ఎంతో మంచిదని ఇది పర్యావరణానికి కూడా ఎంతో దోహదపడుతుందని ఆయన అన్నారు.అలాగే గణపతి నవరాత్రులు నిర్వహించే మండప సమీపాలలో ఎక్కడైనా ప్లాస్టిక్ వినియోగం మంచిది కాదన్నారు అలా చేయడం పర్యావరణానికి ముప్పు రావడమేనని ఆయన తెలియజేశారు. ప్రసాదాలు పానీయాలు ప్లాస్టిక్ కారకాలతో కాకుండా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించుకోవాలని చెప్పారు. అదేవిధంగా ప్రసాద వితరణ కార్యక్రమాల వల్ల పరిసరాల పరిశుభ్రతకు ,విఘాతం కలిగించరాదని అన్నారు. క్రమ పద్ధతిలో ప్రసాద వితరణలు జరిపి వ్యర్థాలను ప్రత్యేక డస్ట్ బిన్ లో వేసుకోవాలని అన్నారు అందరి సహకారంతో వినాయక చవితి పర్యావరణ రహితంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు.

