జనవరి 31అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం
1 min read

వీధి బాలల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్,పిల్లలను తిరిగి బడికి పంపించే ఏర్పాట్లు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జనవరి 31అంతర్జాతీయ వీధి బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ ప్రభుత్వ బాలుర వసతి గృహము నందు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలతో మాట్లాడుతూ బాలల విద్య కోసం ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేశాయని వాటిని వినియోగించుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. తదనంతరం రెండవ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ యం.రాజా, జిల్లా శిశు సంరక్షణ అధికారిని సూర్య చక్ర వేణి,సి డబ్ల్యూ సి ఇన్చార్జ్ చైర్పర్సన్ పి వెంకటేశ్వరరావు ఎల్ ఎస్ కో-ఆర్డినేటర్ యస్. నాగేశ్వరరావు,అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జి.నాగేశ్వరరావు,ప్యానల్ లాయౄ బి.సంగీతరావు పారా లీగల్ వాలంటీర్లు స్థానిక యానాదుల కాలనీలోని ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని,బాలలను పంపేచే తల్లిదండ్రులపై తగులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు.

