NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి 100 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి                

1 min read

పత్తికొండ ఎంఈఓ రమేష్                                   

పత్తికొండ, న్యూస్​ నేడు: 2026 అకాడమిక్ ఇయర్ పదవ తరగతి 100 రోజుల ప్రణాళికను  పకడ్బందీగా అమలు పరచాలని పత్తికొండ మండల విద్యాధికారి గాజుల రమేష్ పాఠశాల సిబ్బందికి సూచించారు. శనివారం  పత్తికొండ స్థానిక జిల్లా పరిషత్ బాలికలు ఉన్నత పాఠశాలలో  ప్రధానోపాధ్యాయురాలు కే. శ్రీదేవి అధ్యక్షతన ” ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి 100 రోజుల ప్రణాళికను గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పత్తికొండ  మండల పరిషత్ అభివృద్ధి అధికారి కవితా రెడ్డి,పత్తికొండ మండలం విద్యాశాఖ అధికారి 2 గాజుల రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కవిత మాట్లాడుతూ, మీ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు పరచాలని, పిల్లలను ఇంటి దగ్గర కూడా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించాలంటే తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలని , ఇంటి దగ్గర కూడా చదివించాలని , అప్పుడే మీ పిల్లలు మంచి ఉత్తీర్ణతతో పాస్ కాగలరని ఆమె తెలిపారు. ఉపాధ్యాయుల కృషికి తోడు మీ సహకారం కూడా చాలా అవసరమని ఆమె తెలిపారు .ఎంఈఓ రమేష్ గారు మాట్లాడుతూ, పిల్లలు చదువుకుంటే ఉన్నత స్థానాలకు వెళ్తారని వారిని చదివించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ఆయన అన్నారు. పిల్లలని క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించినప్పుడే వంద రోజుల ప్రణాళిక విజయవంతం అవుతుందని అప్పుడే మంచి ఫలితాలు సాధించగలరని ఆయన తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి మాట్లాడుతూ చాలామంది అమ్మాయిలు సమయపాలన పాటించడం లేదని, సమయ పాలన పాటించే విధంగా తల్లిదండ్రులు చర్యలు.

About Author