ఘనంగా ఝాన్సీ లక్ష్మి భాయ్198వ జయంతి వేడుకలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు : ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం లో ఝాన్సీ లక్ష్మీ భాయ్ వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. సందర్బంగా ప్రధానాచార్యులు కే. పార్వతి చిత్ర పటానికి మాల వేసి పూజించి, అనంతరం వాసు మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీ భాయ్ 1828నవంబర్ 19న మొరోపంత్ తాంబే మరియు భగీరధీ భాయ్ కి జన్మించారని, ఝాన్సీ అసలు పేరు మణికర్ణిక అయితే అందరు ముద్దుగా మను అని పిలిచేవారని, ఈమె కి కత్తిసాము, గుర్రపు స్వారి, తుపాకీ పేల్చడం వంటి విద్యాలంటే చాలా ఇష్టం. ఈమె ఖడ్గం ధరించి, కళ్లెం బిగించి గాలి విసురుకు ఉవ్వేత్తుగా దూసుకుని పోయేది. లక్ష్మీ భాయ్ 13ఏళ్ళ వయసులోనే ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్ రావు నెవాల్కరను వివాహం చేసుకుంది. బ్రిటిష్ వారిని ఈమె గడగడాలాడించింది. పిల్లలు వేషాధారణ వేశారు. 4వ తరగతి చదివే మెహతాజ్ ఝాన్సీ వేశాధారణ వేశారు. ఈ కార్యక్రమం లో ఆచార్యులు, పిల్లలు, మరియు పోషకులు పాల్గొన్నారు.


