జాబ్ మేళా కు విశేష స్పందన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యం లో నిరుద్యోగ యువతీ, యువకుల కొరకు రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల, కర్నూలు నందు మెగా జాబ్ మేళా నిర్వహించటం జరిగింది. ఈ జాబ్ మేళా నందు 14 కంపెనీ ప్రతినిధులు ఉద్యోగాల కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 259 మంది నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు. వీరిలో 118 మంది ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు.ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జి. పుల్లయ్య , ఉపాధి అధికారి దీప్తి , జిల్లా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ సాయితేజ, ప్రిన్సిపాల్ జ్యోతి , నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ,మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

