మధ్యవర్తిత్వం పై న్యాయవాదులతో సమీక్ష”
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం అనగా 27-02-2026 మధ్యవర్తిత్వ న్యాయవాదులకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి కార్యాలయ భవనం లో మధ్యవర్తిత్వంపై కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం హైకోర్ట్ అన్నీ కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశ పెట్టిందని తెలిపారు . ఇందులో భాగంగా 01-01- 2026 నుండి 07-03- 2026 వరకు ఉమ్మడి జిల్లాల లోని అన్ని కోర్ట్ ల నుండి మధ్యవర్తిత్వ ప్రక్రియ కొరకు కేసులు స్వీకరించబడునని తెలిపారు. వివాదాల పరిష్కారానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 క్రింద పరిగణించేదే మధ్యవర్తిత్వం అని తెలిపారు. దీనివల్ల కోర్ట్ లో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించు కోవచ్చు అని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కక్ష దారులు తమ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ సదస్సులో మధ్యవర్తిత్వ న్యాయవాదులు పాల్గొన్నారు.

