NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానంది సన్నిధిలో జాయింట్ కలెక్టర్

1 min read

మహానంది , న్యూస్​ నేడు:  మహానంది సన్నిధిలో నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ దంపతులు ఆదివారం పూజలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ దంపతులకు కు ఆలయ ఏఈఓ మధు స్వాగతం పలికారు. స్వామివారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను జెసి దంపతులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం జెసి దంపతులను దుశ్యాలువతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెసి వెంట మహానంది తాసిల్దార్ రమాదేవి, ఆర్ ఐ సుబ్బారావు, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, ఆలయ సూపరిండెంట్ శశిధర్ రెడ్డి, నీలకంఠరాజు మహానంది వీఆర్వో చలమయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author