‘‘ఆర్ఎస్కే ’’ వ్యవసాయ సహకార సంఘాలను పరిశీలించిన సంయుక్త కలెక్టర్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు సంయుక్త కలెక్టర్ శ్రీమతి డాక్టర్ బి. నవ్య, ఐఏఎస్ ఈ రోజు కళ్లూరు మండలంలోని మార్కాపురం, గోకులపాడు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలను మరియు కర్నూలు మండలంలోని గార్గేపురం రైతు సేవా కేంద్రం ఆర్ఎస్కే), గార్గేపురం వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)లను పరిశీలించారు.ఈ సందర్శనలో సంయుక్త కలెక్టర్ ఎరువుల నిల్వలు మరియు రైతులకు అందజేస్తున్న సేవలను పరిశీలించారు. మార్కాపురం రైతు సేవా కేంద్రంలో 45 మెట్రిక్ టన్నుల యూరియా అందగా, 41 మెట్రిక్ టన్నులు 231 మంది రైతులకు విక్రయించబడినట్టు పరిశీలించారు.గోకులపాడు రైతు సేవా కేంద్రంలో 35 మెట్రిక్ టన్నుల యూరియా అందగా, 34 మెట్రిక్ టన్నులు 217 మంది రైతులకు పంపిణీ చేసినట్టు నిర్ధారించారు. అలాగే ఈ-పంట యాప్ ద్వారా కంది పంట బుకింగ్ కూడా పరిశీలించారు.గార్గేపురం రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)*లో 37.8 మెట్రిక్ టన్నుల యూరియా అందగా, 25.6 మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేసినట్టు గుర్తించారు.గార్గేపురం వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) ద్వారా 92.7 మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు విక్రయించబడింది. అదనంగా ప్యాక్స్ ద్వారా 40 కేసుల నానో యూరియా విక్రయించబడింది.ప్రధాన సూచనలు ప్రతి రైతుకు గరిష్టంగా 3 సంచులు యూరియా మాత్రమే విక్రయించాలి. రైతులు నానో యూరియాతో ఫోలియర్ స్ప్రే చేయడంకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఇది సాంప్రదాయ ఎరువుల కంటే ఎక్కువ ప్రయోజనకరం.నానో యూరియా మరియు నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహించాలి.రైతులు యూరియా అధికంగా వినియోగించవద్దని సూచించారు.అన్ని రైతు సేవా కేంద్ర సిబ్బంది పంట బుకింగ్ ను వేగవంతం చేయాలని మరియు ఈ-పంట యాప్ లో సమయానుసారంగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. అన్ని రైతు సేవా కేంద్ర సిబ్బంది నానో యూరియా మరియు నానో డీఏపీకి ఇండెంట్లు వేయాలని సంయుక్త కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.సంజుక్త కలెక్టర్ రైతులతో మాట్లాడి, సమతుల్యంగా ఎరువుల వినియోగం, నానో ఎరువుల ప్రయోజనాలు, నేల సారవంతం కాపాడుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ఏడీఏ సాలూ రెడ్డి, కళ్లూరు వ్యవసాయ అధికారి శ్రీ విశ్ణు వర్ధన్ రెడ్డి , కర్నూలు ఎంఏఓ శ్రీ రూఫస్ రోనాల్డ్ కూడా పాల్గొన్నారు.

