కొండమనాయునిపల్లెలో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవుకు మండలం, కొండమనాయుని పల్లె గ్రామంలోని శ్రీ రామాలయం నందు ధార్మిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీమద్రామాయణంపై జయదేవానంద స్వామి ఉపన్యసించారు. తదనంతరం స్థానిక భజన మండలిచే భజన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు శనివారం వరకు ప్రతిరోజు భజనలు, ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వై. శివారెడ్డి, ఆకుల విశ్వనాధరెడ్డి, ఆకుల, నాగిరెడ్డి, బోర్వెల్ శివారెడ్డి, నలుబోలు మల్లారెడ్డి, బోయ జయమ్మ, మోహనరెడ్డి, ఎద్దుల సుబ్బ రాయుడు, గొల్ల వెంకటప్ప, చాకలి కొత్తన్న, గొల్ల శివరాం, పూజారి గురువయ్య, యల్లాల నాగలక్ష్మి, కోనేటి సుబ్బమ్మ, బోయ శేషమ్మ, మంగలి వెంకటప్ప, యర్రగొల్ల రాజశేఖర్, బోయ దస్తగిరి, ఆకుల లక్ష్మి దేవమ్మ, ఆదిలక్ష్మి, మారేమాడుగుల లక్ష్మిదేవి, యర్రగొల్ల లక్ష్మిదేవి, పెట్నికోట నీలాకంటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

