మొక్కలు నాటిన కిమ్స్ వైద్యులు
1 min read

కర్నూలు , న్యూస్ నేడు : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ హాస్పిటల్స్ కర్నూలు వైద్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సీఓఓ డా. సునీల్ సేపూరి మాట్లాడుతూ వైద్యులు అంటే కేవలం వైద్యం చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా కాపాడుతున్నారని అన్నారు. ఇందులో భాగంగానే ఆస్పత్రి ప్రాగణంలో వైద్యులందరూ మొక్కలు నాటారని తెలిపారు. మన పరిసరాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. మనిషి స్వచ్ఛమైన గాలి అవసరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. వైద్యంతో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడంలో కర్నూలు కిమ్స్ హాస్పిటల్స్ ఎల్లప్పుడు ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రికి చెందిన అన్ని విభాగాల వైద్యులు పాల్గొన్నారు.

