NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదలకు వైద్య సేవ…అదృష్టం..

1 min read

సీనియర్ గ్యాస్ర్టో ఎంట్రాలజిస్ట్ డా. శంకర్ శర్మ

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : డాక్టర్స్ డే వేడుకలను జీ. పుల్లారెడ్డి దంత వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు  శంకర్ శర్మ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా నేషనల్ డాక్టర్స్ డే విశిష్టతను డాక్టర్ శంకర్ శర్మ దంత వైద్య విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినత్సవంగా నిర్వహిస్తామని ఇందుకు కారణం వైద్యసేవకే వన్నెతెచ్చిన బీసీరాయ్ అని డాక్టర్. శంకర్ శర్మ తెలిపారు. బీసీ రాయ్  జన్మదినం, మరణించిన రోజూ రెండూ జూలై1 అందుకే ఆయన స్మారకార్థం ప్రతీ ఏడాది జూలై ఒకటన తేదీన వైద్యుల దినోత్సవంగా నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.  విద్యార్థులు  మంచి ఆహారం‌, వ్యాయామం, ధ్యానం చేయాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు.  అనంతరం డెంటల్ కళాశాల యాజమాన్యం డాక్టర్. శంకర్ శర్మ ను సన్మానించారు. కార్యక్రమం లో జీ. పుల్లారెడ్డి దంత వైద్య కళాశాల కరస్పాండెంట్ మురళీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ నాగ లక్ష్మిరెడ్డి, వివిధ విభాగాల అధ్యాపకులు, దంత వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

About Author