NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అంతర్జాతీయ బాలల పుస్తకాల దినోత్సవం సందర్భంగా రిడ్జ్ స్కూల్‌లో ఈ రోజు ఉదయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల  సీఈఓ శ్రీ గోపీనాథ్  మాట్లాడుతూ పుస్తక పఠనానికి ఉన్న ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు.పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, ఆలోచనా శక్తి అభివృద్ధి చెందుతుందని, పుస్తక పఠన అలవాటు మనసుకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా, విద్యార్థులలో మంచి విలువలను పెంపొందిస్తుందని డీన్ శ్రీ రాజేంద్రన్  తెలిపారు. ముఖ్యంగా చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉంటే భాషా పరిజ్ఞానం పెరిగి, పదసంపద (Vocabulary) అభివృద్ధి చెందుతుందని చెప్పారు.ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రిన్సిపల్ శ్రీమతి రాజ్ కమల్  మాథ్యూస్ మాట్లాడుతూ ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి పుస్తకాలు చదవాలని ప్రోత్సహించారు. పుస్తకాలు మనకు మంచి మిత్రుల వంటివని, అవి మన జీవితాన్ని మెరుగైన దిశగా తీసుకెళ్తాయని వివరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ  కార్యక్రమం చిన్నారుల చక్కనైన నృత్య ప్రదర్శనతో విజయవంతంగా ముగిసింది.

About Author