NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏప్రిల్ 5వ తేదీ ఎన్టీఆర్ 103వ జయంతి ఉత్సవాలు

1 min read

103 మంది కళాకారులకు సన్మాన సత్కారం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏప్రిల్ 5వ తేదీ 2026 సాయంత్రం వై ఎం హెచ్ ఏ హాల్లో జరగబోయే 103 వ నందమూరి తారక రామారావు  జయంతోత్సవాల సందర్భంగా 103 మంది కళాకారులకు జరగబోయే ఆత్మీయ సత్కార ఆహ్వాన పత్రాన్ని బుధవారం ఏలూరు నగర శాసనసభ్యులు  బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కి ఏలూరు నగర కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం  ఆర్ పెదబాబు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో ఆహ్వాన పత్రికను అందచేయడం జరిగింది.ఆర్ ఆర్ పేట ఎన్టీఆర్ పార్క్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి, ప్రధాన కార్యదర్శి బి. వెంకట్రావు  మరియు వాకర్ అసోసియేషన్ సభ్యులు ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ప్రతి కళాకారుడు, కళాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author