NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్ర

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరంలో పూజ్యపాద శ్రీ శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న 89వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం సందర్భంగా, శ్రీ సీతారాముల పట్టాభిషేక మహోత్సవ శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు యాగ కమిటీ సభ్యులు వాసు దేవయ్య, సాయిరాంలు తెలిపారు.వినాయక ఘాటు నుండి యాగశాల వరకు బుధవారం సాయంత్రం 5 గంటలకు ఈ మహోత్సవ శోభాయాత్ర ప్రారంభమవుతుందని,  ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని ధార్మిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  నగరంలోని అన్ని ధార్మిక సంఘాలు, కుల సంఘాలు, హిందూ సంఘాలు సమష్టిగా పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయగలరని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు తూముకుంట ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. ఈ శోభాయాత్రలో  భజనలు, నామసంకీర్తనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి కార్యక్రమాలతో ఈ యాత్ర సాగుతుందని తలిపారు. ఈ ధర్మ పరిరక్షణకై సాగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై శ్రీ సీతారాముల పట్టాభిషేక శోభాయాత్రలో భక్తులు వేలాదిగా  పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ఈ సమావేశంలో ధార్మిక సంస్థల ప్రతినిధులు శివకోటి చంద్రశేఖర్, శ్రీధర్, రామిరెడ్డి, సుబ్రమణ్యం, రాఘవేంద్ర ప్రసాద్, శ్రీనివాసులు, నారాయణ, జనార్దన్ రెడ్డి, నరసింహారెడ్డి, నాగోజీరావు, డాక్టర్ మల్లు వెంకటరెడ్డి, శివ సాయినాథ్,మురళితో పాటు వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *