విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి. డాక్టర్. శంకర్ శర్మ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు డాక్టర్స్ కాలనీలో ఉన్న బాష్యం స్కూల్ బ్రాంచ్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు లోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈవేడుకలకు డాక్టర్. శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ ను బాష్యం స్కూల్ హెడ్మాస్టర్ప్రియాంక, ప్రిన్సిపాల్ రాంప్రసాద్ సన్మానించారు. ఈసందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ బాష్యం విద్యా సంస్థల్లో విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో పాల్గొనాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో చదువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు పౌష్టికాహారంతో పాటు పండ్లు, గుడ్లు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం చేయాలని విద్యార్థులను కోరారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అభినందించారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాంప్రసాద్, హెడ్మాస్టర్ ప్రియాంక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

