NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

1 min read

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.డి.వి. ప్రసాద్ 

పోరాటాలతో సాధించుకున్న కార్మికుల చట్టాలను రద్దు చేస్తున్న ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం

ఏలూరు, న్యూస్​ నేడు: కార్మికులు అనేక పోరాటాలతో  కార్మికుల చట్టాలను రద్దుచేసిసాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్పొరేట్లకు అనుకూలమైన 4లేబర్ కోడ్స్ అమలు చేయడానికి నోటిఫికేషన్ జారీ  చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. స్థానిక శనివారపు పేట గాలిగోపురం వద్ద శనివారం ఉదయం భవన నిర్మాణ కార్మికులతో  నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులు సంఘం పెట్టుకునే హక్కు,  సమ్మె హక్కు యజమానులతో బేరసారాలు నడిపే హక్కు ఇలా అనేక కార్మిక హక్కులను లేబర్ కోడ్స్ వలన కార్మికులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, ఆటోడ్రైవర్లు,గిగ్  వర్కర్లు వంటి అనేక అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని లేని పక్షంలో అన్ని రంగాల కార్మికులను సమీకరించి దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎర్ర రాంబాబు అధ్యక్షత వహించగా సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి ఎం. ఇస్సాకు,జి సాంబశివరావు, టి.రాజు,ఎం.కుసుడు, వాస సత్యనారాయణ తదితరులు నాయకత్వం వహించారు.

About Author