NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాక్ ఎమ్మెల్యే మణికంఠకు అభినందనలు తెలిపిన దెందులూరు ఎమ్మెల్యే

1 min read

చట్టసభల విశిష్టత,రాష్ట్ర అభివృద్ధి రాజకీయాలు విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలి

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: చట్టసభల విశిష్టత, వాటి పనితీరు, రాజకీయాలు,రాష్ట్ర అభివ్రుద్ది ,సామాజిక అభ్యున్నతి పై బాలలకు విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థులకు సూచించారు.బాలలకు కేవలం పుస్తకంశాలు మాత్రమే కాకుండా చట్ట సభలు, వాటి పని తీరు, సామాజిక అభ్యున్నతి, మారుతున్న టెక్నాలజీ, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల పనితీరు, రాష్ట్ర అభివృద్ధి వంటి అంశాలపై సైతం వారికి అవగాహన కలిగి ఉండాల్సిన ఆవశ్యకత ఉందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలి అనేది ఎంతోమంది కలగా ఉంటుందని, తాము ఎన్నో సంవత్సరాలపాటు ప్రజల కోసం కష్టపడి ప్రజల్లో అభిమానాన్ని పొంది ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టామని కానీ ఈనాడు ఎనిమిదవ తరగతి విద్యార్థి మణికంఠ నియోజకవర్గం తరఫున బాల ఎమ్మెల్యేగా ఎన్నికయి మాకు అసెంబ్లీలో అడుగుపెట్టనుండడం ఎంతో అభినందనీయమని, నియోజకవర్గస్థాయిలో జరిగిన అనేక పోటీల్లో ప్రతిభ చాటి మణికంఠ ఈ కార్యక్రమానికి ఎంపిక అవడం అభినందించదగ్గ అంశం అని, అందుకు మణికంఠకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈనెల 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు చేపట్టిన చర్యలు నిజంగా ఎంతో అభినందనీయమని విద్యార్థుల్లో చట్టసభల పట్ల వాటి పనితీరు పట్ల ప్రభుత్వ వ్యవస్థల పనితీరు పట్ల అవగాహన కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్  తెలిపారు.ఈ సందర్భంగా బాలుడు మణికంఠ మాట్లాడుతూ ఎంతో అత్యున్నతమైన రాష్ట్ర అసెంబ్లీలో తాను దెందులూరు నియోజకవర్గం ప్రతినిధిగా ఎంపికయి అసెంబ్లీకి వెళ్లడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని, తనను ప్రోత్సహించి అభినందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని కి కూటమి ప్రభుత్వానికి పాఠశాల అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారూ.ఈ కార్యక్రమంలో దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ విజయ్ కుమార్ తో పాటు బాలుడి తల్లిదండ్రులు సలాధి పోతురాజు,కల్పన పాల్గొన్నారు.

About Author