“ముస్లిం స్వతంత్ర సమరయోధుల ఆర్ట్ గ్యాలరీ”ను సందర్శించిన నాయకులు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: భారతదేశ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిం అమర సమరయోధుల త్యాగ, బలిదానాలను వారి పోరాట పటిమను తెలుపుతూ సమ సమాజానికి సామరస్య సంకేతాన్ని విస్తరింపజేససే సదుద్దేశంతో హొళగుంద మండల కేంద్రంలోని స్థానిక నాలుగవ వార్డులో గల “మద్రేసా సల్ఫియా లిల్ బనాత్” ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘ముస్లిం స్వాతంత్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీ’ కార్యక్రమంలో ముఖ్య అతిధులై పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత మాజీ కార్యదర్శి శ్రీ చిన్నహ్యట శేషగిరి , యువ నాయకులు సి.హెచ్ అశోక్, టిడిపి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సుభాన్, ఐ టి డి పి ఆలూరు అసెంబ్లీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కే. ఖాదర్ బాషా తదితరులు.అతిధులు “ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఆర్ట్ గ్యాలరీ” ను సందర్శించి, మనకు దక్కిన-మనందరం అనుభవిస్తున్న స్వాసంత్ర్యం సర్వమతాల సమిష్టి సామరస్యతతోనే సాధించబడిందని, అయితే నేడు దేశం మొత్తం కులమతాల కుంపట్లో కొట్టుమిట్టాడుతుందని ఇటువంటి కల్మష తరుణంలో సర్వమతాలను సమైక్యపరిచే సంపూర్ణ భద్రత సర్వులపై ఉందని తెలిపారు .నేడు కొన్ని విద్వేశ శక్తులు స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లిములు మరితర మూలనివాసుల భాగస్వామ్యాన్ని మరియు అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ విరజిమ్ముతున్న విష ప్రచారానికి అసలైన జవాబుగా మరుగున పడుతున్న చరిత్రను మనందరి ముందు ఆవిష్కరించడమే కాక ఆజాద్ హిందుస్థాన్ కొరకు ప్రాణ త్యాగాలను కూడా పుణ్యంగా భావించి అమరులైన కొన్ని వేలమంది డాక్టర్లు, విద్యావంతులు, ప్రొఫెసర్లు మౌల్విలు, విప్లవకారులు చివరకు తమ పిల్లలను స్వతంత్ర్య విప్లవ ఉద్యమంలో పోగొట్టుకోవడమే కాక తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రాణ త్యాగం చేసిన ఎందరో మాతృమూర్తులు మహనీయయుల విరోచిత పోరాట గాథలను వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని తమ అమూల్య సందేశాన్ని వ్యక్తపరుస్తూ మరో మారు చరిత్రకారులు, రచయిత, పుస్తకప్రేమి, ముఖ్యమంత్రి అవార్డు గ్రహీత డాక్టర్ నసిర్ అహ్మద్ ని మరియు “మద్రేసా సల్ఫియా లిల్ బనాత్” నిర్వాహకులు మరియు పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలను తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్లమడికి ఎస్ఎంసి చైర్మన్ భాస్కర్, యువనాయకులు గంగన్న, తెలుగుదేశం ,తదితరులు పాల్గొన్నారు.


