NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేవిఆర్ కాలేజ్  ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ లో  న్యాయ విజ్ఞాన సదస్సు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి గారి సూచనల మేరకు  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవ దినోత్సవంను పురస్కరించుకొని ఈ రోజు అనగా 07.11.2025 న కర్నూలు  నందు గల  కేవిఆర్ కాలేజ్  ఆఫ్ క్లస్టర్ యూనివర్సిటీ నందు  న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.  ఈ సదస్సులో  లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం మాట్లాడుతూ  జాతీయ న్యాయ సేవ దినోత్సవ ప్రత్యేకత ను, సైబర్ చట్టాలు మరియు క్రిమినల్ చట్టాల గురించి ఉచిత న్యాయ సేవలు న్యాయ సేవ అధికార సంస్థ నుంచి ఎలా పొందాలో వివరించారు. అనంతరం లీగల్ సర్వీసెస్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఎవరికైనా చట్టపరమైన న్యాయ సహాయం కావాలంటే లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100 కాల్ చేసి పొందవచ్చు అని తెలిపారు.   ఈ సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే. వి. వెంకట రెడ్డి, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్  అధ్యాపకులు డాక్టర్ శాహితి,  విద్యార్థులు పాల్గొన్నారు.

About Author