NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వినాయకుని పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి..

1 min read

డీజే కు అనుమతి లేదు.. -ఇన్చార్జి ఎస్ఐ తిరుపాలు..

నందికొట్కూరు, న్యూస్​ నేడు : వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పండుగలో అలర్లు సృష్టిస్తే కమిటీ సభ్యులు బాధ్యత వహించాల్సి ఉంటుందని జూపాడుబంగ్లా ఇన్చార్జి ఎస్ఐ తిరుపాలు అన్నారు.నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వినాయక ఉత్సవ కమిటీ (పీస్ కమిటీ) సభ్యులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్ఐ మాట్లాడుతూ గ్రామాల్లో వినాయకుని విగ్రహ ప్రతిష్ట నుండి నిమజ్జనం వరకు అల్లర్లు జరగకుండా చూసుకోవాలని నాయకుని నిమజ్జనంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీజే కు అనుమతి లేదన్నారు.ఒకవేళ డీజే పెట్టినట్లయితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గ్రామాల్లో వినాయకుడిని ప్రతిష్టించాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వినాయక మండపానికి కరెంట్ షాట్ సర్క్యూట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో ఏమైనా సంఘటన జరిగితే వెంటనే కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇన్చార్జి  ఎస్ఐ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్సై మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author