ఆలూరు తెదేపా ఇన్చార్జిగా వైకుంఠం జ్యోతి…
1 min read

సంబరాలు చేసుకున్న తెదేపా శ్రేణులు……
హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా వైకుంఠం జ్యోతి ను పార్టీ అధిష్టానం సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, సీనియర్ నాయకులు దుర్గప్ప, ఆదం, లుక్మన్ సాబ్,వెంకటేష్, జమాపుర సురేష్,వైకుంఠం యూత్ అయ్యప్ప,వలి బాషా,గిరి, టి ఎన్ ఎస్ ఎఫ్ మల్లి, టిడిపి నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ వైకుంఠం జ్యోతి ని ఆలూరు టిడిపి ఇన్చార్జిగా నియమించినందుకు గాను సీఎం చంద్రబాబు నాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస యాదవ్ కు ధన్యవాదాలు తెలిపారు. తెదేపా ఆలూరు ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి నాయకత్వంలో ఆలూరు నియోజకవర్గ అభివృద్ధితోపాటు తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పాటుపడతారని అన్నారు. ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు కలిసికట్టుగా అహర్నిశలు కృషి చేయాలని,రానున్న ఎన్నికల్లో విజయ డంక మోగించి, నారా చంద్రబాబునాయుడు కి కానుకగా ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


