NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సార్వత్రిక  సమ్మెలో భాగంగా నిరసన తెలిపిన ఏపీ జేఏసీ

1 min read

పత్తికొండ న్యూస్ నేడు:    దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షన్ పత్తికొండ తాలూకా జేఏసీ పక్షానఈరోజు భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమము చేపట్టారు. పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ ను రద్దు చేయాలని, కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని పి ఆర్ డి ఏచట్టాన్ని రద్దు చేయాలని,   పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలని, అలాగే కాంటాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనే డిమాండ్లతో జేఏసీ పక్షాన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ దారులు నిరసన తెలిపారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ, ఆర్ డి ఓ భరత్ నాయకులు కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో తాలూకా జేఏసీ చైర్మన్ సాయిబాబా, సెక్రటరీ రమేష్ జిల్లా ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు నాగేంద్ర ఏపీ టిఫ్ పక్షాన రంగారెడ్డి,  కార్యవర్గ సభ్యులు పెన్షనర్స్ అసోసియేషన్ పక్షాన టిఎండి హుస్సేన్, జయరాములు, ప్రతాపు, బ్రహ్మయ్య, ఏపీ ఎన్జీవోస్ పక్షాన బాలకృష్ణ, శ్రీధర్ ప్రకాష్ కిషోర్ శ్రీనివాసులు, విజయ్ కుమార్, తదితరులు అదేవిధంగా ఉమన్ వింగ్ ఏపీఎన్జీవోస్ పక్షాన వరలక్ష్మి, చైత్యన్య కుమారి, శ్రీకల, చాముండేశ్వరి, శంకరమ్మ, దీపిక తదితరులు పాల్గొన్నారు.

About Author