ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన శాసనసభ్యులు
1 min read

అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడి
రౌడీ మూకలతో కలిసి మాజీ మంత్రులు మీడియా సంస్థలపైకి వెళ్లడం ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనం : పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్
పెనమలూరు,న్యూస్ నేడు: హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి యత్నాన్ని పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు,రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా ఎమ్మెల్యే అభివర్ణించారు. సొంతగా మీడియా సంస్థలను నడుపుతూ… మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోన్న వైసీపీ… తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు,దూషణలు చేయడం అసంబద్ధం అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై,ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని ఎమ్మెల్యే గుర్తు చేశారు. రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు,మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శం అని వ్యాఖ్యానించారు.ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్ధాలుగా కేసులకు,దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను,ఛానెల్‌ను నడుపుతున్నారన్నారు.దాడులు,నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని బోడే ప్రసాద్ స్పష్టం చేశారు.అధికారంలో ఉండగా మహిళల పట్ల,సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు,ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు,నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ దుయ్యబట్టారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పితా గోపీచంద్ మండల పార్టీ అధ్యక్షులు కోయ ఆనందప్రసాద్ తెలుగు రైతు కార్యదర్శి కుర్ర నరేంద్ర బిసి సెల్ అధ్యక్షులు సంగేపు రంగారావు బొంగరాల అబ్రహం జయరాజు మోరం భరద్వాజ్ నాగుల్ మీరా షేక్ సలీం కొక్కిలిగడ్డ నాగేశ్వరరావు కూటమి నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

