NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంచారజాతుల విముక్తి దినోత్సవాన్ని జయప్రదం చేయండి

1 min read

బిజెపి డిఎన్ టి అధ్యక్షులు దొమ్మర శ్రీనివాసులు

చెన్నూరు , న్యూస్ నేడు :  ఈనెల 30వ తేదీన విజయవాడలోని  ది వెన్యూ ఫంక్షన్ హాల్ లో నిర్వహించే సంచారజాతుల విముక్తి దినోత్సవాన్ని జయప్రదం చేయడం కోసం సంచార జాతులు, ఓ బి సి లు, వెనుకబడిన బీసీలు, తరలి రావాలని బిజెపి డి ఎన్ టి జిల్లా అధ్యక్షులు దొమ్మర శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురువారం చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ, బిజెపి జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగాల గోపి శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన విజయవాడలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్ లో సంచారజాతుల విముక్తి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గానికి చెందిన సంచార జాతులు, ఓబీసీలు, వెనుకబడిన బీసీలు అందరూ సమైక్యంగా సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సంచార జాతులకు, అలాగే వెనుకబడిన ఓ బి సి, బీసీ లకు ఇచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి అవగాహన కలిగించడమే కాకుండా ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా పొందాలి ఎలా సద్వినియోగం చేసుకోవాలి వంటి విషయాలపై ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని అయితే కొంతమంది సంచార జాతుల వారికి ఈ పథకాల విషయం తెలియదని, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో సంచార జాతులు ఉన్నాయని, అలాంటివారికి ఇలాంటి వేదికల ద్వారా అవగాహన కల్పించడమే కాకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తించే విధంగా తామంతా కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సంచార జాతులు తరలి రావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఓ. బి.సి మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మావతి భాయి ఓ బి సి అధ్యక్షులు ప్రభు కుమార్. మంజుల రామకృష్ణ , తదితరులు పాల్గొన్నారు.

About Author