NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చెన్నూరులో గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

1 min read

న్యూస్ నేడు చెన్నూరు:  మండల కేంద్రమైన చెన్నూరులో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వారోత్సవాలను మండల విద్యాశాఖ అధికారి సునీత ప్రారంభించారు. చెన్నూరు గ్రంథాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ భారతదేశం మొదటి ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రు జయంతి సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకోవడం ప్రతి ఏడాది వస్తున్నదని తెలిపారు. నెహ్రు ముఖ్య ఉద్దేశం దేశానికి సేవ చేసి మంచి పౌరులుగా విద్యార్థులు అభివృద్ధి చెందాలని నెహ్రూ అభివతమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి. ఎస్ నాగాంజలి మాట్లాడుతూ వారం రోజులు పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. విద్యార్థులకు వ్యాచరచన వక్తుత్వ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకురాలు అరుణ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author