19 న లివర్ స్క్రీనింగ్ ప్యాకేజీ ప్రారంభం – మెడికవర్ హాస్పిటల్స్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వరల్డ్ లివర్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు లో లివర్ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక లివర్ స్క్రీనింగ్ ప్యాకేజీను ప్రారంభించారు. ఈ ప్యాకేజీని శ్రీ జి. కబర్ధి గారు (ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి), శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి (సెక్రటరీ, DLSA) మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. అబ్దుల్ సమద్ గారు సంయుక్తంగా ప్రారంభించారు.లివర్ సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి, సమయానికి చికిత్స అందించడమే ఈ ప్యాకేజీ ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేయబడింది. లివర్ సమస్యలు మొదటి దశలో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారని వైద్యులు తెలిపారు. అందుకే ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.లివర్ స్క్రీనింగ్ ప్యాకేజీలో ఉండే పరీక్షలు:లివర్ ఫంక్షన్ టెస్ట్ (LFT), యూరిక్ యాసిడ్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ (FBS), హెపటైటిస్ B స్క్రీనింగ్ (HBsAg), అబ్డొమెన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్, లిపిడ్ ప్రొఫైల్, అవసరమైతే హెపటైటిస్ B వ్యాక్సిన్, లివర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ఈ ప్యాకేజీ సాధారణ ధర ₹4,100 కాగా, ప్రత్యేక ఆఫర్‌గా ₹2,000కే అందుబాటులో ఉంచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు. ఈ ఆఫర్ 31 మే 2026 వరకు అమల్లో ఉంటుంది. వైద్యుల ప్రకారం, మద్యం వినియోగం, అధిక కొవ్వు ఆహారం, వైరల్ ఇన్ఫెక్షన్లు వంటి కారణాలు లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని తెలిపారు. కాబట్టి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ద్వారా లివర్ వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించవచ్చని సూచించారు.ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ Maheswar Reddy మాట్లాడుతూ, “లివర్ ఆరోగ్యం మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. ఈ స్క్రీనింగ్ ప్యాకేజీ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చుతో ముందస్తు పరీక్షలు చేయించుకుని వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం మెడికవర్ హాస్పిటల్స్ కట్టుబడి ఉంది” అని తెలిపారు.

