NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాళ్లకు కర్రలతో శ్రీశైల మల్లన్న చెంతకూ వెళ్తూ

1 min read

వేలాదిగా తరలి వెళ్తున్న భక్తులు..

న్యూస్ నేడు నందికొట్కూరు:ఉగాది పండుగ సందర్భంగాకర్ణాటక రాష్ట్ర భక్తులకు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారు పుట్టినిల్లు అనే నమ్మకంతో వేలాదిమంది భక్తులు కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి (కర్ణాటక నుండి శ్రీశైలం వరకు 536 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర)రోడ్డు మార్గాన చిన్న పిల్లలతో పాటుగా పురుషులు,స్త్రీలు ఎంతో చక్కగా భక్తిశ్రద్ధలతో పాటలు పాడుకుంటూ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం నేషనల్ హైవే రోడ్డు వైపున జాతీయ రహదారిపై వెళ్తూ శ్రీశైల భ్రమరాంబ స్వామిని దర్శించుకునేందుకు వెళ్తూ ఉన్నారు.రోడ్డు మార్గాన దాతలు అడుగడుగునా టెంట్లు వేసి భక్తులకు టిఫిన్ భోజన వసతి,చల్లని మజ్జిగ భక్తులకు అందజేస్తూ దేవుని సేవలో తరిస్తూ ఉన్నారనే చెప్పవచ్చు.భక్తులు కొందరైతే ఏకంగా రెండు కాళ్లకు కర్రలు కట్టుకొని రోడ్డుపై వెళ్తూ ఉండగా ప్రజలు ఆశ్చర్య పోతున్నారు.

About Author