NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుంది..

1 min read

మండల విద్యాధికారి వెంకటేష్ నాయక్

పదోన్నతి మరియు బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

ప్యాపిలి, న్యూస్​ నేడు:  ప్యాపిలి మండలంలోని మెట్టుపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గత నాలుగు సంవత్సరాలుగా మెట్టుపల్లి గ్రామంలో పనిచేసి ఇటీవల జరిగిన పదోన్నతులు మరియు బదిలీలలో పీ.యస్.హెచ్.యం గా ప్రమోషన్ పొంది హోలగుంద మండలానికి వెళ్ళిన ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డికి మరియు బదిలీ పై కొలిమిగుండ్ల మండలానికి వెళ్ళిన ప్రధానోపా ధ్యాయుడు రవీంద్ర గుప్త కు, డోన్ మండలానికి వెళ్ళిన  ఉపాధ్యాయురాలు రమాదేవి లకు మెట్టుపల్లి పాఠశాల తరపున శుభాకాంక్షలు, తెలిపి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్యాపిలి మండల విద్యాధికారి వెంకటేశ్ నాయక్ హాజరయ్యారు. ఎం.ఈ.ఓ వెంకటేశ్ నాయక్ మాట్లాడుతూ వృత్తిలో పదోన్నతి అనేది మరింత బాధ్యతను పెంచుతుంది అనీ చిన్న వయసులో పదోన్నతి పొందిన చిన్నపరెడ్డి కి మరియు బదిలీ పై వెళ్లిన రవీంద్రగుప్త మరియు రమాదేవి లకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల లోని మౌళిక వసతులను పరిశీలించారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు  మెట్టుపల్లి పాఠశాల పనితీరు పై మెరుగైన సూచనలు,సలహాలు ఇచ్చారు. ఇతర అతిథులుగా హాజరైన ఉపాధ్యాయులు వెంకట్ నాయక్ , హాజిమస్థాన్ వలి లు  ఉపాధ్యాయుడు చిన్నపరెడ్డి మెట్టుపల్లి పాఠశాల తో పాటు, ప్యాపిలి మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలలకు,విద్యార్థులకు అందించిన సేవలను కొనియాడారు. పదోన్నతి మరియు బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయుడు శివ,  యం.ఆర్.సి సిబ్బంది  మద్దయ్య, రామాంజినేయులు, పాఠశాల మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు రామాంజినమ్మ, స్కావెంజర్ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

About Author