మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాలలో అల్లర్లు సృష్టించకుండా జరుపుకోవాలి..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : దేవరగట్టు శ్రీ మాళ సహిత మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నేరనికి గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై దిలీప్ కుమార్ గురజాల తాసిల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో విజయ లలిత గ్రామస్తులతో మాట్లాడుతూ బన్నీ ఉత్సవ జైత్రయాత్రలో ఎటువంటి గొడవల కు పాల్పడకుండా, అల్లర్లు సృష్టించకుండా మద్యం తాగి బన్నీ ఉత్సవంలో పాల్గొనరాదని బన్నీ ఉత్సవాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా జరుపుకోవాలని కోరారు. ఎవరైనా మద్యం, నాటు సారా అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ గురు ప్రసాద్, మరియు పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.


