NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలి

1 min read

ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు

చెన్నూరు , న్యూస్ నేడు: మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో ఇంటింటికి వెళ్లి జిఎస్టి, సూపర్ సేవింగ్స్ వంటి వాటిని గురించి స్వయం సహాయక సంఘాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారము మండల పరిషత్ సభా భవనము నందు సోమవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులకు జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఛాంపియన్లకు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు, డిప్యూటీ ఎంపీడీవో సురేష్ బాబు,లు మాట్లాడుతూ, జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించాలని అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. ఇంటింటికి వెళ్లే సమయంలో సచివాలయ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల  వారి సహాయం తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించవలసిందిగా వారు కోరారు. అలాగే ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడి ఫోటోలు  వీడియోలు తీసి వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని వారు కోరారు. అదేవిధంగా  స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం  అక్టోబర్ 2 వరకు నిర్వహించవలసిందిగా కోరుతూ, ప్రతి ఒక్కరూ పచ్చదనం పరిశుభ్రతను లక్ష్యంగా పెట్టుకొని దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించవలసిందిగా వారు తెలియజేశారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగించి, తడి చెత్త, పొడి చెత్త వ్యర్ధాల పైన ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు లేకుండా చూసు కోవాలని అక్కడ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన తర్వాత తప్పకుండా నోట్ క్యాంపు తో ఫోటోలు తీసి వెబ్సైట్ నందు అప్లోడ్ చేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో, కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author