NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మల్లన్న భక్తులకు అన్నదానం..

1 min read

శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్  ఆధ్వర్యం సేవా కార్యక్రమం

 కర్నూలు, న్యూస్​ నేడు: ఉగాది పండుగ (19-03-2026 )సందర్భంగా కర్ణాటక రాష్ట్రం  నుండి కాలినడకన శ్రీశైలం వెళ్లే కొన్ని వేల మంది భక్తులకు కర్నూల్ పట్టణంలో  ఏర్పాటు చేసే అన్నప్రసాద వితరణ కార్యక్రమం లో భాగస్వాములవుతున్నారు.  కర్ణాటక రాష్ట్రం నుండి వయా కర్నూలు మీదుగా శ్రీశైలం కాలినడకన వెళ్లే కొన్ని వేల మంది భక్తులకు కర్నూల్ పట్టణంలో గత 3 సంవత్సరాలుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమమును దిగ్విజయంగా పూర్తి చేసి 4 వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఈ సంవత్సరము కూడా గతంలో మాదిరిగా వస్తు రూపేనా లేదా ధన రూపేనా విరాళాలు అందించి ఈ బృహత్కర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు, కరుణ కటాక్షాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజి సేవా ట్రస్ట్. కొన్ని వేల మంది కాలినడకన వెళ్లే భక్తులకు దాతల సహకారంతో చేసే  శ్రీ బాలాజి సేవా ట్రస్ట్-అన్న ప్రసాద వితరణ అనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీ బాలాజి సేవా ట్రస్ట్ సేవకులు సైనికుల్లాగా పని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది.  కార్యక్రమంలో  విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అద్యేక్షుడు సాయి రెడ్డి నందిరెడ్డి, వెంకటేశ్వరస్వామి ప్రఖండ తిమ్మారెడ్డి, ఎల్. రాజు తో పాటుగా శ్రీ బాలాజి సేవా ట్రస్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజయ రెడ్డి మరియు ట్రస్ట్ ఛైర్మెన్ శ్రీకాంత్ ట్రెజరర్ శివకోటి చంద్రశేఖర్ మరియు సభ్యులు  మోహన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author