NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

41 ఏళ్ల … ఆత్మీయ సమ్మేళనం..

1 min read

1984–85 బ్యాచ్​ విద్యార్థుల అపూర్వ కలయిక..

  • అప్పటి గురువులను ఘనంగా సన్మానించారు..

కర్నూలు, న్యూస్​ నేడు :జీవితంలో స్థిరపడ్డారు…. పిల్లలకు… మరెందరికో ఆదర్శంగా నిలిచారు.. 40 ఏళ్ల తరువాత మిత్రులందరూ కలిసి.. తమకు చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించాలనే  దృఢ సంకల్పంతో ఏకమయ్యారు.  గురువుల అభినందనలు, ఆశీర్వాదలు పొందారు. కర్నూలు జిల్లా కొత్త కోట జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ( 1984–85) చదివిన విద్యార్థులు 41 ఏళ్ల తరువాత కలిశారు. కర్నూలు నగరంలోని  ఓ హోటల్​ లో 1984–85 బ్యాచ్​ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అప్పటి గురువులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. గురువుల ఆశీర్వాదాలు పొందారు. అంతకు ముందు పాఠశాలలో చదువుతున్న రోజుల్లో చేసిన అల్లర్లు,మంచి పనులు, చదువులో చూపిన శ్రద్ధ, ఏకాగ్రత, పట్టుదల, లక్ష్యాన్నిచెబుతూ… జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.  ప్రస్తుతం ఉపాధ్యాయులుగా, అడ్వకేట్​ గా, వ్యాపారులుగా తదితర రంగాల్లో   స్థిరపడటంతో అప్పటి ఉపాధ్యాయులు అందరినీ అభినందనందించారు.   కార్యక్రమంలో పూర్వపు విద్యార్థులు ఆర్​. రాముడు, వెంకటేశ్వర్లు, ఈ. మద్దిలేటి గౌడ్​,  నర్సయ్య, ఖాశీం, రామయ్య,  టి.కె. నరసింహులు, కృష్ణ మూర్తి , మాణిక్య రెడ్డి, ఎన్​.హెచ్​. మద్దిలేటి, రామ్మోహన్​ రెడ్డి, కర్నూలు శ్రీనివాసులు,   సుంకేసుల శ్రీనివాసులు, సోమన్న తదితరులు పాల్గొన్నారు.

About Author