మార్కెండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
1 min read

ఆదోని, న్యూస్ నేడు : పద్మశాలి కుల బాంధవులు ఆరాధ్య దైవం భక్త మార్కెండేయ స్వామి దేవాలయంలోని పరమేశ్వరుడికి సోమవారం భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయ పూజారి ఉదయం ఐదున్నర గంటలకే స్వామివాకి ప్రత్యేక పూజలు చేసి, మంగళహారతి ఇచ్చారు. వాసా మహేంద్ర, శశికళ దంపతులు గోత్రనామాలతో స్వామికి పంచామృతాభిషేకం చేయించారు. కాంచనం గోవిందరాజులు, అన్న పూర్ణ దంపతులు స్వామి వారికి కేసరిని స్వామికి నైవేద్యంగా సమర్పించారు. అలాగే దేవాలయంలో వెలిసిన శ్రీ దుర్గమ్మ అమ్మ వారికి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు.


