NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“మాతా శిశు  సంరక్షణ ఐసిడిఎస్ ధ్యేయం”

1 min read

ప్రపంచ తల్లిపాల వారోత్సవ ప్రారంభసభలో ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.విజయ

కర్నూలు, న్యూస్ నేడు:  ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో  నిర్వహించడం ఆనవాయితీగా  వస్తున్నదే.ఈ కార్యక్రమంలో భాగంగా  శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రారంభ సభను కలెక్టర్ కార్యాలయంలోని  జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. విజయ మాట్లాడుతూ 2025 ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను”స్థిరమైన  మద్దతు ఇచ్చే వ్యవస్థలను ఏర్పరిచి, తల్లిపాల సంస్కృతి ప్రోత్సాహానికి ప్రాధాన్యత ఇద్దాం” అనే నినాదంతో నిర్వహిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా నేటికీ 88.6%  ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతున్నప్పటికీ పుట్టిన గంటలోపు ముర్రుపాలు ఇచ్చే తల్లులు 41.8% ఉండటం బాధాకరమన్నారు. ప్రతి తల్లి పుట్టిన గంటలోపు ఇచ్చే మురుపాలు అమృతంతో సమానమని, దీనివల్ల పిల్లల్లో మేధాశక్తి పెరగడంతో పాటు, నిమోనియా విరోచనాలు లాంటి వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందన్నారు. పాలిచ్చే తల్లులకు సైతం  గర్భాశయ,అండాశయ క్యాన్సర్ల  బారిన పడకుండా రక్షించుకోగలుగుతారన్నారు. నేడు తల్లిపాలను కలుషితం చేసేలా పాల పౌడర్ లాంటి వాణిజ్య ప్రకటనల  వల్ల, మితిమీరిన అందచందాలను  కాపాడుకోవాలనే కాంక్షతో కొంతమంది తల్లులు బిడ్డలకు పాలు ఇవ్వకుండా చేస్తున్నారని వాపోయారు. ఐఎంఎస్​  చట్టం   పకడ్బందీగా అమలు అయ్యేలా చూడాలన్నారు.తల్లి బిడ్డ అనుబంధానికి, ఆరోగ్యానికి తల్లిపాలు శ్రేష్టమన్నారు. తల్లిపాల సంస్కృతి పెంచి, రక్షణలో ఉన్న లోపాలను అధిగమించేందుకు ఐసిడిఎస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆగస్టు ఒకటి నుండి ఏడు వరకు ప్రతిరోజు  అంగన్వాడి సెంటర్ పరిధిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు . అనంతరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ప్రతిజ్ఞను చేశారు.ఈ కార్యక్రమంలో  జిల్లాలోని సిడిపీఓ కోడుమూరు సిడిపిఓ వరలక్ష్మి, కర్నూల్  సిడిపీఓ అనురాధ, ఆలూరు సిడిపిఓ నరసమ్మ, మంత్రాలయం సిడిపివో రాజేశ్వరి దేవి, ఎమ్మిగనూరు సిడిపీఓ సపరున్నిసా బేగం, నోడల్ ఆఫీసర్ రేవతి జోష్ణ, ఈఓ, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author