గుల్లదుర్తిలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నేడు కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి గ్రామంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు, స్థానిక కూటమి నేతలు, కార్యకర్తలు.గుళ్లదుర్తిలో రూ. 7 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిఅలాగే గుళ్లదుర్తి గ్రామంలో రూ. 20 లక్షలతో స్థానిక నరసింహస్వామి దేవాలయం నుంచి పలగాడి రోడ్డు వరకు అంతర్గత సిమెంట్ రోడ్లు & కాలువల నిర్మాణంను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో తొలి ఏడాది విజయవంతంగా పూర్తి చేసిన నేఫథ్యంలో “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రభుత్వం.ఇందులో భాగంగా నేడు గుళ్లదుర్తి గ్రామంలో ఇంటింటికీ తిరిగి గతేడాది కాలంలో కూటమి ప్రభుత్వం అధించిన అభివృద్ధి – సంక్షేమంతో కూడిన సుపరిపాలన గురించి ప్రజలకు వివరించి, కరపత్రాలు పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి, ఆర్ధిక ఇబ్బందులున్నా… సూపర్ సిక్స్ లో భాగంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నట్లు ప్రజలకు తెలియజేసిన మంత్రి.


