మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలి
1 min read

పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
బెల్ట్ షాపులను పూర్తిగా నివారించాలి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
మత్తు పదార్థాల నియంత్రణకు పటిష్ట చర్యలు
జిల్లా ఎస్పి సునీల్ షేరాన్
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించిన (NCORD) జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ రాజకుమారి గణియా, ఎస్పీ సునీల్ షేరాన్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ…. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకంపై జిల్లాలోని పాఠశాలల, కళాశాలల నుంచి ఏవైనా ఫిర్యాదులు వచ్చాయా అనేది పరిశీలించాలన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో విస్తృతంగా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వాడకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు బానిస కాకుండా పోలీస్ విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. వాటిని వాడితే వచ్చే దుష్పరిమాణాలపై ఎక్సైజ్, సెబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో ఎక్సైజ్,పోలీసు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, డీఈవో, ఐసిడిఎస్ బీసీ, ఎస్సీ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు, పాల్గొన్నారు.

