NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదిత్యుడే ఆదిదేవుడు…

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.

నందికొట్కూరు నందు ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

నందికొట్కూరు, న్యూస్​ నేడు: సకల ప్రాణులలో జీవశక్తిని నింపే చైతన్య ప్రధాత సూర్యభగవానుడేనని, ప్రతి జీవరాశిలో సూర్యుని తేజస్సు ప్రవేశిస్తేనే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో  నందికొట్కూరు పట్టణం, కోటవీధిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు మంగళవారం ధార్మిక కార్యక్రమాలను వారు ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలుగు పండితులు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కవిరాజ, డాక్టర్ చిన్నావుల వేంకట రాజారెడ్డి శ్రీమద్రామాయణంలో శ్రీరాముడు చేసిన ఆదిత్య ఉపాసన, సూర్యభగవానుని మహిమలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు నాగభూషణ శర్మ, అర్చకులు సురేశ్ స్కాలర్స్ పాఠశాల కరెస్పాండంట్  కాళ్ళురి లక్ష్మి, ధార్మిక సంస్థల ప్రతినిధులు అల్వాల బాలయ్య, హేమలత జి.భాస్కర రెడ్డి, బి. రమణ రెడ్డి, శెట్టి రవీంద్ర ప్రసాద్, బి.సురేశ్,  కాంతారెడ్డి, మోహన్ రెడ్డి, ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎ. శివశంకర రెడ్డి,పుల్లారెడ్డి, రమణయ్య, రామిరెడ్డి, , రాముతో పాటు ఆదిత్య హృదయం పారాయణ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

About Author