ఘనంగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు 9వ వార్షికోత్సవ వేడుకలు
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రారంభం నుంచే సంస్థతో కలిసి సేవలందిస్తున్న వైద్యులు, అలాగే మొదటి రోజు నుంచి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పాల్గొని వేడుకలను మరింత అర్థవంతంగా మార్చారు.ఈ సందర్భంగా సీనియర్ న్యూరాలజిస్ట్ డా. నాగ సురేష్ గారు మాట్లాడుతూ, “మెడికవర్ హాస్పిటల్స్ ప్రారంభం నుంచి రాయలసీమ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒక సంస్థగా మాత్రమే కాకుండా కుటుంబంలా కలిసి పనిచేయడం వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైంది. ఈ ప్రయాణంలో భాగస్వామి కావడం గర్వంగా ఉంది” అని తెలిపారు.సీనియర్ కార్డియాలజిస్ట్ డా. చైతన్య కుమార్ గారు మాట్లాడుతూ, “ప్రారంభం నుంచే మెడికవర్ హాస్పిటల్స్ పేషెంట్స్ నమ్మకాన్ని కేంద్రంగా పెట్టుకొని సేవలు అందిస్తోంది. ఆధునిక వైద్య సదుపాయాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సంస్థ నిరంతరం ముందుకు సాగుతోంది” అని అన్నారు.కార్డియాలజిస్ట్ డా. తేజ నందన్ గారు మాట్లాడుతూ, “మెడికవర్ హాస్పిటల్స్ ఎదుగుదల వెనుక వైద్యులు, సిబ్బంది అందరి సమిష్టి కృషి ఉంది. ప్రారంభం నుంచి సంస్థతో కలిసి పనిచేయడం ఎంతో సంతృప్తినిస్తుంది” అని తెలిపారు.కార్డియాలజిస్ట్ డా. బి.ఎస్. ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ, “ప్రాంతీయ ప్రజలకు అత్యుత్తమ గుండె సంబంధిత చికిత్సలు అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృత సేవలతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు హెడ్ శ్రీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,“9 సంవత్సరాలుగా మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు ప్రజల విశ్వాసంతో ముందుకు సాగుతోంది. ప్రారంభం నుంచి సంస్థకు అండగా నిలిచిన వైద్యులు, ఉద్యోగుల సమర్పణే మా బలంగా నిలిచింది. రాబోయే రోజుల్లో కూడా రాయలసీమ ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉన్న వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు, సిబ్బంది గత తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మెడికవర్ హాస్పిటల్స్ కర్నూలు 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతూ మరింత ఉత్సాహంతో ప్రజల ఆరోగ్య సంరక్షణలో ముందుండనుందని నిర్వాహకులు తెలిపారు.

