జాతీయ చేనేత దినోత్సవం రూపకల్పనకు సమావేశం..
1 min read
ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ చేనేత కుల సంఘాల సమాఖ్య కర్నూలు యూనిట్
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కార్యక్రమ రూపకల్పనకు ఈరోజు బీ.సీ భవన్, బిర్లా కాంపౌండ్ నందు శ్రీ నక్కల మిట్ట శ్రీనివాసులు అధ్యక్షతన సమావేశమై తేదీ: 7/8/2025 న ఉదయం 11 గంటలకు కలెక్టరేట్ నందలి గాంధీ విగ్రహం దగ్గర సమావేశం కావడం 11:30 గంటలకు చేనేత జోలి శాఖ కార్యాలయం సమావేశం మందిరం లో చేనేతల సమస్యలపై చర్చించడం, ఆపైన స్థానిక మంత్రి అయిన టీజీ భరత్ కి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది. సమావేశంలో పాల్గొన్న చేనేత నాయకులు శ్రీ నక్కల మిట్ట శ్రీనివాసులు , చింత శ్రీనివాసులు, శ్రీ దాశెట్టి శ్రీనివాసులు, ఘడియ ప్రసాద్, మాది గుండు కృష్ణయ్య, హెచ్. రవి శంకర్రావు, కె.పి. రాధాకృష్ణ,కూన రాజశేఖర్, దేవ నాగరాజు, అక్కెం విశ్వనాథ్ మొదలగు వారు పాల్గొన్నారు.

