మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
1 min read

వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
ట్రాయ్ ఏజి మెంబర్ బి. శారద
చెన్నూరు ,న్యూస్ నేడు: మహిళలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని తమ మొబైల్ కు వచ్చే సందేశాల పట్ల జాగ్రత్తలు వహించాలని ఎవరైనా మీ మొబైల్ కు ఫోన్లు చేసి ఓటీపీలు అడిగితే వారికి ఓటిపిలు చెప్పరాదని ట్రాయ్స్ ఏజీ మెంబర్ బి శారద తెలిపారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయం నందు గల కమ్యూనిటీ హాల్ నందు టెలికా వినియోగదారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో ట్రాయ్స్ ఏజి మెంబర్ బి. శారద మాట్లాడుతూ ,వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆమె తెలియజేశారు. అవాంచిత మొబైల్ కాల్స్ నియంత్రణ కోసము 1 9 0 9 నెంబర్ను ట్రాయ్ వారు కేటాయించారని సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆమె డ్వాక్రా మహిళలకు తెలియజేశారు. మై స్పీడ్ వ్యాప్ ద్వారా నెట్వర్క్ సిస్టమును మరింత మెరుగుపరుచుకోవచ్చని అలాగే ఒక నెంబర్ పై సరైన నెట్వర్క్ సేవలు అందకపోతే మరొక నెట్వర్కు కు ఎలా మారాలో పోర్ట్ గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కడప కెనరా బ్యాంక్ ఎల్. ఎఫ్. సి వీరప్రసాద్ మాట్లాడుతూ, తమకు వచ్చే ఓటీపీలు ఎవరికి చెప్పకూడదని వాట్సాప్ లలో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయరాదని తెలియజేశారు. కార్యక్రమంలో మహిళలు అడిగిన కొన్ని ప్రశ్నలకు సిఐజి శారద సమాధానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు చెన్నూరు వెబ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ ప్రసాద్ , అంగన్వాడీ కార్యకర్తలు ,వెలుగు సిబ్బంది వెలుగు సీసీలు, వివో లు పాల్గొన్నారు.


