NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిశ్రమ పంటలు ప్రోత్సహించాలి

1 min read

పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి

వలసల నివారణకు చర్యలు తీసుకోవాలి

వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి

కర్నూలు , న్యూస్ నేడు: జిల్లాలో మిశ్రమ పంటలను ప్రోత్సహించాలని , పంట నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని , వలసలు నివారించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంకాలం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ అనుబంధ శాఖల సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి నిర్వహించి సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ…జిల్లాలో ఉల్లి ,టమోటా ,పత్తి ,మిరప ,శనగ మొదలగు పంటలను ఈ సంవత్సరం ఖరీఫ్ మరియు రబీలో ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు , ఒక ఎకరా కు ఎంత దిగుబడి వస్తుంది , రైతుకు ఎంత ఖర్చు అవుతుంది , గిట్టుబాటు ధర ఎంత వస్తుంది , ఏ విధంగా పంట నష్టం జరుగుతుంది పంట నష్ట కు నివారణ చర్యలు , పంటలు నిల్వ చేసుకోవడానికి అవసరమైన గిడ్డంగులు ఏర్పాటు ,  వాతావరణ పరిస్థితులు మొదలగు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు , ఈ సందర్భంగా మిశ్రమ పంటలు వేసే విధంగా రైతులను ప్రోత్సహించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులను నిర్ణిత సమయంలోనే పంటలు వేసుకునే విధంగా అవగాహన పరచాలని , పంట మార్పిడి , మిశ్రమ పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోరన్న విషయాన్ని వారికి ఆదర్శ రైతులు , రైతు సేవా కేంద్రాలు మరియు ఎఫ్.పి.ఓ ల ద్వారా తెలియజేసి వారిని ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి పంటకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే విధంగా చర్యలు సిద్ధం చేసుకుని ఉండాలని అధిక వర్షాల వలన మరియు వర్షాభావం వలన జాగ్రత్తలు పాటించి ఎటువంటి పరిస్థితుల్లోనూ పంట నష్టాలు జరగకూడదని రైతులకు గిట్టుబాటు ధరలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో ఉల్లి ప్రాసెసింగ్ మరియు టమాటో ప్రాసెసింగ్ యూనిట్లను పెంచే చర్యలు తీసుకోవాలని , స్వయం సహాయక సంఘాల మహిళలకు మరియు రైతులకు మేకలు , గొర్రెలు , గేదల కు రుణ సౌకర్యం కల్పించి , పాల ఉత్పత్తి జరిగే లాగా చర్యలు తీసుకొని వాటి ద్వారా వారికి ఆదాయం సమకూర్చే చర్యలు తీసుకోవాలని ఆ విధంగా చేయడం వలన వారిని వలసలకు పోకుండా ఆపాలని , వారి పిల్లల చదువులు ఆగిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డి ఆర్ డి ఎ పిడి రమణారెడ్డి ,  డ్వామా పీడీ వెంకటరమణయ్య , పశుసంవర్ధక శాఖ జెడి శ్రీనివాసులు హార్టికల్చర్ ఏడి రాజ కృష్ణారెడ్డి , సెరికల్చర్ ఏడి ఆంజనేయులు , మార్క్ఫెడ్ డిఎం గద్వాల రాజు , మార్కెట్ యార్డ్ ఏడి నారాయణమూర్తి , ఫిషరీస్  డిడి రంగనాథరావు , అగ్రికల్చర్ ఏడి రాజశేఖర్ , నాబార్డ్ మేనేజర్ సుబ్బారెడ్డి , ఎల్డియం రామచంద్ర రావు మొదలగువారు పాల్గొన్నారు.

About Author