NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

15 వ ఆర్థిక సంవత్సరం నిధులను కేటాయించాలని కలెక్టర్ కు వినతి

1 min read

ఆలూరు న్యూస్ నేడు: కర్నూల్ లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్  పి రంజిత్ భాష వినతి పత్రం అందించిన ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి  మరియు జిల్లా సర్పంచులు15 వ ఆర్థిక సంవత్సరం నిధులను కేటాయించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష ను కోరిన సర్పంచులు.. గ్రామాల అభివృద్ధికి నిధులు లేక మౌలిక సదుపాయాలు కల్పించలేక పోతున్నామని తెలిపారు. గ్రామాలలో కనీసం డ్రైనేజీలు, రోడ్లు, త్రాగునీటి సమస్యను తీర్చలేక పోతున్నామని అన్నారు.సర్పంచులకు తమ మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి , ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటి సభ్యులు మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి లు, కన్వీనర్లు,ఎంపీపీ లు, పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైయస్సార్​సిపి నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులు, బివిఆర్  అభిమానులు పాల్గొన్నారు.

About Author