వైసిపిపై మాటల తూటాలతో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే బడేటి
1 min read

వైసీపీ దుష్టచేష్టలకు అరాచ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజా సహకారం అవసరం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :వైసిపి దుష్టచేష్టలకు, అరాచక ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజాసహకారం అత్యంత అవసరమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు చూస్తోన్న వైసిపి నాయకులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులనే విషయాన్ని ప్రజలకు వివరించడంతో పాటూ, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించేందుకు నెలరోజుల పాటు సుపరిపాలనలో తొలిఅడుగు పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏలూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఇతర నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడమే పనిగా పెట్టుకున్న మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి. ఆరాచకశక్తులకు కొమ్ముకాస్తూ సమాజానికి అత్యంత ప్రమాదకారకంగా మారారని ధ్వజమెత్తారు. ఇదేక్రమంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన ఎమ్మెల్యే చంటి ఐదేళ్ళలో గత వైసిపి వైసిపి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వంలో ప్రజల వాయిస్ వినే దమ్ము, ధైర్యం, సమస్యలు పరిష్కరించే సత్తా లేదని ఎద్దేవా చేశారు. బుధవారం నుండి తొలి అడుగు ద్వారా ప్రజల వాణిని వినేందుకు తాను ప్రతిఇంటిని సందర్శించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో ఈడ చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్థసారధి,కో-అప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

